వెలిగొండ సొరంగాల నుంచి కృష్ణా జలాలు.. నల్లమల సాగర్‌కు జలకళ

1205చూసినవారు
వెలిగొండ సొరంగాల నుంచి కృష్ణా జలాలు.. నల్లమల సాగర్‌కు జలకళ
AP: శ్రీశైలం నుంచి వెలిగొండ సొరంగాల ద్వారా ఫీడర్ కెనాల్‌తో వస్తున్న కృష్ణా జలాలతో నల్లమల సాగర్ రిజర్వాయర్ నిండింది. ప్రస్తుతం 4 టీఎంసీల నీరు చేరింది. ఆగస్టు 31వ తేదీన సీఎం చంద్రబాబు వెలిగొండ ప్రాజెక్టును ప్రారంభించి కృష్ణా జలాలను విడుదల చేశారు. తొలిదశలో 1.19 లక్షల ఎకరాలకు సాగునీరు, 4 లక్షల ప్రజలకు తాగునీరు అందుతుంది. పూర్తిస్థాయిలో పూర్తయితే ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాల్లోని నాలుగున్నర లక్షల ఎకరాలకు సాగునీరు, 23 లక్షల మందికి తాగునీరు అందుతుంది.

సంబంధిత పోస్ట్