738 కి.మీ ప్రయాణించి కుప్పానికి కృష్ణమ్మ

8865చూసినవారు
738 కి.మీ ప్రయాణించి కుప్పానికి కృష్ణమ్మ
AP : 738 కి.మీ ప్రయాణించి కృష్ణా జలాలు చిత్తూలు జిల్లా కుప్పం చేరుకున్నాయి. 19 నియోజకవర్గాలను తాకుతూ, 10 రిజర్వాయర్లను నింపుతూ శ్రీశైలం నుంచి నదీ జలాలను కుప్పానికి తరలించారు. రికార్డు టైంలో హంద్రీ-నీవా విస్తరణ పనులు చేపట్టామని సీఎం చంద్రబాబు తెలిపారు. శనివారం కుప్పం నియోజకవర్గంలో కృష్ణమ్మకు సీఎం చంద్రబాబు జలహారతి ఇవ్వనున్నారు. 215 క్యూసెక్కుల సామర్థ్యంతో 123 కి.మీ పొడవున కుప్పం బ్రాంచ్ కెనాల్ నిర్మించారు.

సంబంధిత పోస్ట్