త్వరలో జనసేనలోకి ఆమంచి కృష్ణమోహన్?

35చూసినవారు
త్వరలో జనసేనలోకి ఆమంచి కృష్ణమోహన్?
AP: రాష్ట్రవ్యాప్తంగా ఇతర పార్టీలు, తటస్థులను జనసేనలో చేర్చుకునేందుకు 14 మందితో కూడిన కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీలో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి కీలక పాత్ర పోషిస్తూ, ప్రకాశం జిల్లాపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. గతంలో స్వతంత్ర అభ్యర్థిగా గెలిచిన నేతతో పాటు, రాయలసీమలో వైసీపీపై అసంతృప్తితో ఉన్న రెడ్డి సామాజిక వర్గ నేతలను జనసేనలోకి తీసుకురావడానికి ఆయన ప్రణాళిక సిద్ధం చేశారు. ఈ నేపథ్యంలో ప్రకాశం జిల్లాకు చెందిన ఆమంచి కృష్ణమోహన్ త్వరలో జనసేనలో చేరతారని రాజకీయ వర్గాల్లో విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. బాలినేని ఆయనతో కీలక చర్చలు జరుపుతున్నట్లు సమాచారం.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్