కుప్పం ఎయిర్‌పోర్టు భూసేకరణకు మార్గం సుగమం

34చూసినవారు
కుప్పం ఎయిర్‌పోర్టు భూసేకరణకు మార్గం సుగమం
AP: కుప్పం విమానాశ్రయ ప్రాజెక్టు కోసం 150 ఎకరాల భూసేకరణకు మార్గం సుగమమైంది. భూసేకరణను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను ఏపీ హైకోర్టు కొట్టేయడంతో, కొందరు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అయితే, ప్రజాప్రయోజనం స్పష్టంగా నిరూపించలేదని పిటిషనర్ల తరఫు న్యాయవాది వాదించినా, హైకోర్టు తీర్పులో జోక్యం చేసుకోవడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. దీంతో భూసేకరణ నోటిఫికేషన్లపై సుప్రీంకోర్టు జోక్యం చేసుకోబోమని స్పష్టం చేసింది.

సంబంధిత పోస్ట్