
కర్నూలు: విషాదం.. నవోదయ ప్రిన్సిపల్ దుర్మరణం
వేలేరు జవహర్ నవోదయ పాఠశాల ఇన్ఛార్జి ప్రిన్సిపల్ యదునందనరావు ఆదివారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందారు. కర్నూలు (D) ఎమ్మిగనూరుకు చెందిన ఆయన విజయవాడలో కుమార్తెను కలిసి తిరిగి వస్తుండగా, గమ్యానికి కొద్ది దూరంలో ఆగి ఉన్న టిప్పర్ను ఆయన కారు ఢీకొంది. ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలపాలై ఆయన మరణించడంతో నవోదయ పాఠశాలలో విషాద ఛాయలు అలుముకున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.























