కర్నూలులో నిర్వహించిన భారీ బహిరంగ సభలో కేంద్ర మంత్రి భుపతిరాజు శ్రీనివాస వర్మ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కర్నూలు నగరం ఒకప్పటి రాజధాని అని, త్యాగానికి చిహ్నమని అన్నారు. జీఎస్టీ సంస్కరణలపై ఇచ్చిన హామీని ప్రధాని నిలబెట్టుకున్నారని పేర్కొన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం సూపర్ సిక్స్ హామీలను అమలు చేసిందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో 10 నెలల్లో వేల కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు జరిగాయని అన్నారు.