
ఆదోని: రోడ్డు ప్రమాదంలో ఔట్సోర్సింగ్ ఆర్టీసీ డ్రైవర్ మృతి
ఆదోని పట్టణానికి చెందిన ఔట్సోర్సింగ్ ఆర్టీసీ డ్రైవర్ మందుల వీరేష్ (28) రోడ్డు ప్రమాదంలో గాయపడి, వారం రోజుల చికిత్స అనంతరం మంగళవారం మృతి చెందారు. పత్తికొండ డిపోకు చెందిన వీరేష్ ఆస్పరి మండలం చీగిలి గ్రామ సమీపంలో బైక్పై వెళ్తూ కిందపడడంతో తీవ్రగాయాలయ్యాయి. కర్నూలు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన తుది శ్వాస విడిచారు. వీరేష్ మృతితో ఆదోనిలో విషాద ఛాయలు అలుముకున్నాయి.






































