ఆదోని: పొలానికి వెళ్తుండగా రోడ్డు ప్రమాదంలో రైతు మృతి

774చూసినవారు
ఆదోని: పొలానికి వెళ్తుండగా రోడ్డు ప్రమాదంలో రైతు మృతి
కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలో ఆదివారం రోడ్డు ప్రమాదం జరిగింది. విక్టోరియాపేటకు చెందిన పాండురంగ పొలానికి వెళ్లేందుకు బైకుపై బయలుదేరగా, బైపాస్ ఓవర్ బ్రిడ్జి వద్ద వెనుక నుంచి వచ్చిన స్కార్పియో వాహనం బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో పాండురంగ అక్కడికక్కడే మృతిచెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనతో కుటుంబ సభ్యులు, స్థానికులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.