ఆదోని వ్యవసాయ మార్కెట్ యార్డులో వేరుశనగ గ్రేడింగ్ విధానాన్ని రద్దు చేయడానికి వ్యాపారులు అంగీకరించారు. గురువారం సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ సూచన మేరకు, వారం రోజులపాటు గ్రేడింగ్ లేకుండానే వేరుశనగ కొనుగోలు చేయనున్నట్లు ప్రకటించారు. ఈ సమయంలో ఏదైనా నష్టం జరిగితే తర్వాత చూసుకుంటామని వ్యాపారులకు సూచించారు. రైతులు తమ వేరుశనగను ఇంటివద్దే శుభ్రంగా ఆరబెట్టాలని, తేమశాతం ఎక్కువగా ఉంటే టెండర్ విధానానికి మారాలని సూచించారు.