ఆదోనిలో శుక్రవారం జరిగిన చలో ఆదోని కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నేషనల్ స్టూడెంట్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ నిత్ రాయల్, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విద్యా విధానాలపై తీవ్ర విమర్శలు చేశారు. దేశాన్ని నేపాల్ తరహాలో తయారు చేస్తున్నారని ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్‌లో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను సహించబోమని ఆయన స్పష్టం చేశారు.