ఆదోనిలో కల్వర్టు పనులు ప్రారంభం కాకపోవడంపై సీపీఐ ఆగ్రహం

8చూసినవారు
ఆదోనిలో కల్వర్టు పనులు ప్రారంభం కాకపోవడంపై సీపీఐ ఆగ్రహం
ఆదోని రామయ్య లేబర్ కాలనీ స్కూల్ ఎదుట కల్వర్టు నిర్మాణానికి రూ. 22 లక్షల నిధులు మంజూరైనా పనులు ప్రారంభం కాకపోవడంపై సీపీఐ నేతలు శుక్రవారం ఆగ్రహం వ్యక్తం చేశారు. జూలై 24న ఎమ్మెల్యే, మున్సిపల్ అధికారుల ఆధ్వర్యంలో భూమిపూజ జరిగినప్పటికీ, మూడు నెలల్లో నిర్మాణం పూర్తి చేస్తామని ఎమ్మెల్యే ఇచ్చిన హామీ నెరవేరలేదని వారు గుర్తుచేశారు. పనులు వేగవంతం చేయకపోతే సీపీఐ ఆధ్వర్యంలో మరో ధర్నా చేపడతామని హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్