ఆదోని పట్టణంలో ఐదవ రోజు గణేష్ నిమజ్జనాల్లో ప్రజలకు సహకరిస్తూ పనిచేస్తున్న పోలీసు అధికారులకు సిబ్బందికి డ్రై ఫ్రూట్ అందించారు. పట్టణానికి చెందిన సోషల్ వర్కర్ షేక్ నూర్ అడిషనల్ ఎస్పీ హుస్సేన్ పీరా చేతుల మీదుగా సిబ్బందికి పంపిణీ చేశారు. వారి సేవలపై స్పందించిన అధికారులు కొనియాడారు. యువత తమ తమ బాధ్యతలతో పాటు సామాజిక సేవ అలవర్చుకోవాలని ఏఎస్పి సూచించారు.