ఆదోని నియోజకవర్గంలోని బసాపురం సచివాలయం వద్ద ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం, సీపీఐ ఆధ్వర్యంలో గురువారం ధర్నా జరిగింది. ఖరీఫ్ సీజన్లో వర్షాలు సరిగా కురవక పంటలు నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ. 50 వేల పరిహారం అందించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ప్రభుత్వం పంట నష్టాన్ని అంచనా వేసి ప్రతి రైతును ఆదుకోవాలని రైతు సంఘం నాయకులు కోరారు.