ప్లాస్టిక్ బాటిళ్లు ఇస్తే బహుమతులు

1చూసినవారు
ప్లాస్టిక్ బాటిళ్లు ఇస్తే బహుమతులు
ఆదోని మున్సిపాలిటీ ఆధ్వర్యంలో స్వచ్ఛతా హి సేవ కార్యక్రమంలో భాగంగా మంగళవారం వెంకన్న బావి సమీపంలోని RRR సెంటర్ వద్ద ‘రియూజ్ ఆఫ్ ప్లాస్టిక్స్’ కార్యక్రమం నిర్వహించారు. ఇళ్లలో నిరుపయోగంగా ఉన్న ప్లాస్టిక్ బాటిళ్లను అందజేస్తే బహుమతులు అందించేలా కార్యక్రమం చేపట్టారు. 5 కిలోల ప్లాస్టిక్ బాటిళ్లకు చీర, 3 కిలోలకు జ్యూట్ బ్యాగ్, 5 బాటిళ్లకు చాక్లెట్ అందిస్తున్నట్లు తెలిపారు. మున్సిపల్ కమిషనర్ నయీమ్ అహ్మద్, సిబ్బంది, ప్రజలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్