నీటి కుంటలో మునిగి బాలిక మృతి

4197చూసినవారు
నీటి కుంటలో మునిగి బాలిక మృతి
ఆస్పరి మండలంలోని అలిగార గ్రామంలో సోమవారం ఒక విషాదకర సంఘటన చోటుచేసుకుంది. గ్రామ నివాసి మహానంది, వీరేశమ్మ దంపతుల కుమార్తె శిరీష (12) స్నేహితురాలు, వృద్ధురాలితో కలిసి గరుసు నీటి కుంటలో బట్టలు ఉతకడానికి వెళ్లింది. బట్టలు ఉతుకుతుండగా, చీర నీటిలోకి జారిపోవడంతో దాన్ని పట్టుకోవడానికి ప్రయత్నించిన శిరీష కాలుజారి నీటిలో పడిపోయింది. ఆమెను కాపాడేందుకు స్నేహితురాలు కూడా నీటిలోకి దిగడంతో ఇద్దరూ మునిగిపోసాగారు. వృద్ధురాలి కేకలు విని సమీపంలోని వ్యక్తులు వచ్చి ఒకరిని కాపాడగా, శిరీష నీటిలో మునిగి మృతి చెందింది.

సంబంధిత పోస్ట్