ఆదోని మండలం ఢణాపురంలో గుప్త నిధుల కోసం పాడుబడిన బావిలో తవ్వకాలు జరిపిన ఘటన శుక్రవారం వెలుగులోకి వచ్చింది. సర్వే నం. 107ఏలో ఈ తవ్వకాలు చేపట్టారు. వినాయక నిమజ్జనాన్ని ఆసరాగా చేసుకుని క్షుద్ర పూజలు చేసినట్లు సమాచారం. సమాచారం అందుకున్న వన్‌టౌన్ సీఐ శ్రీరాములు సంఘటనా స్థలానికి చేరుకుని, తవ్వకాలు చేపట్టిన 12 మందిని అదుపులోకి తీసుకున్నారు. మరికొందరు పరారీలో ఉన్నట్లు తెలిపారు.