దేవరగట్టు తొక్కిసలాట మృతుని కుటుంబానికి సహాయం ఇవ్వాలి

72చూసినవారు
కర్నూలు జిల్లా హోళగుంద మండలం దేవరగట్టు బన్నీ ఉత్సవాల్లో జరిగిన తొక్కిసలాటలో ఆదోనికి చెందిన వ్యక్తి మృతి చెందడంతో, మృతుడి కుటుంబానికి సహాయం చేయాలని ఆదోని బీజేపీ వార్డు ఇంచార్జి మల్లిక డిమాండ్ చేశారు. సోమవారం ఆదోని సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ కు వినతిపత్రం సమర్పించారు. ఇంటి పెద్దను కోల్పోయిన కుటుంబానికి సహాయం అందించాలని కోరారు. సబ్ కలెక్టర్ పూర్తిస్థాయిలో విచారించి సహాయం అందిస్తానని హామీ ఇచ్చారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you