ఆదోనిలో వైరల్ ఫీవర్ల విజృంభణ: వైద్యుల కొరతతో రోగుల ఆవేదన

1390చూసినవారు
ఆదోనిలో వైరల్ ఫీవర్లు ప్రబలడంతో ప్రజలు ఆసుపత్రుల బాట పడుతున్నారు. స్థానిక జనరల్ హాస్పిటల్‌లో రోజువారీ ఓపీ 800 దాటుతోంది, మలేరియా, టైఫాయిడ్, డెంగ్యూ పరీక్షలు 200కు చేరుకుంటున్నాయి. 70 మంది వైద్యుల అవసరం ఉండగా, కేవలం 17 మంది మాత్రమే పనిచేస్తున్నారు. ఈ వైద్యుల కొరత కారణంగా వైద్యులు, రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మెరుగైన వైద్య సేవలు అందించాలని, ప్రజా సంఘాలు ప్రజాప్రతినిధులు, జిల్లా కలెక్టర్ ప్రత్యేక దృష్టి సారించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.