ఆదోని తిమ్మారెడ్డి బస్టాండ్ సర్కిల్లో AIYF ఆధ్వర్యంలో భగత్ సింగ్ జయంతి కార్యక్రమం నిర్వహించారు. భగత్ సింగ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి, యువతతో ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా సీపీఐ నాయకులు మాట్లాడుతూ స్వాతంత్ర ఉద్యమంలో భగత్ సింగ్ చేసిన త్యాగాలను గుర్తు చేశారు. యువత ఆయన జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకుని చదవడం, ప్రశ్నించడం, సామాజిక మార్పు కోసం కృషి చేయాలని, ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సీపీఐ, AIYF, AISF నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.