
తాగునీటి సమస్య: రెండో మోటార్ ఏర్పాటుకు బీఎస్పీ డిమాండ్
ఆలూరులో సోమవారం బహుజన్ సమాజ్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి రామలింగయ్య మాట్లాడుతూ, హాలహర్వి మండలం బాపురం గ్రామ సమీపాన ఉన్న తాగునీటి పంప్ హౌస్ నుండి 50 గ్రామాలకు నీరు అందుతున్నా, ఒక్కటే మోటార్ ఉండటంతో నీటి సమస్య తీవ్రంగా ఉందని తెలిపారు. రెండో మోటార్ ఏర్పాటుకు ఏఈ, ఇతర ప్రజా ప్రతినిధులు సహకరించాలని ఆయన బీఎస్పీ తరపున డిమాండ్ చేశారు.


































