
ఆదోని: డ్రంకెన్ డ్రైవ్‌పై కఠిన చర్యలు: జైలు, జరిమానా
పెద్దతుంబళం పోలీస్ స్టేషన్ పరిధిలో డ్రంకెన్ డ్రైవ్ కేసుల్లో పట్టుబడిన ఆరుగురికి బుధవారం ఆదోని సెకండ్ అడిషనల్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ శ్రీవల్లి 15 రోజుల జైలు శిక్షతో పాటు ఒక్కొక్కరికి రూ. 10 వేలు చొప్పున మొత్తం రూ. 60 వేలు జరిమానా విధించారు. ప్రజల ప్రాణాలకు ప్రమాదం కలిగించే విధంగా మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై ఇలాంటి కఠిన చర్యలు కొనసాగుతాయని ఎస్సై మల్లికార్జున తెలిపారు. ప్రజలు మద్యం సేవించి డ్రైవింగ్ చేయరాదని హెచ్చరించారు.




































