
నాగులాపురం అంగన్వాడీలో ఆహారం తిన్న పిల్లలకు అస్వస్థత
ఆదోని మండలం నాగులాపురం అంగన్వాడీ కేంద్రం-2లో మధ్యాహ్న భోజనం తిన్న 10 మంది చిన్నారులు కడుపునొప్పి, వాంతులతో అస్వస్థతకు గురయ్యారు. వీరిలో ఇద్దరిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సీడీపీవో, సబ్‌కలెక్టర్ సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. అపరిశుభ్రమైన ఆహారమే కారణమని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు.
































