
ఆదోని జిల్లా సాధనకై ఈనెల 10న బంద్
ఆదోనిని జిల్లాగా ప్రకటించాలని కోరుతూ ఈనెల 10వ తేదీన జిల్లా సాధన కమిటీ (జేఏసీ) ఆధ్వర్యంలో ఆదోని బంద్ చేపట్టనున్నారు. ఈ బంద్ కు అన్ని వర్గాల ప్రజలు, వ్యాపార సంస్థలు, చిరు వ్యాపారులు సహకరించాలని జేఏసీ సభ్యులు నూర్ అహ్మద్, దస్తగిరి నాయుడు, కోదండ పిలుపునిచ్చారు. జిల్లా సాధన పోరాటంలో ప్రతి ఒక్కరూ పాల్గొని బంద్ ను విజయవంతం చేయాలని వారు కోరారు.



































