
ఆదోని: సాఫ్ట్వేర్ ఉద్యోగం పేరుతో రూ. 4 లక్షల మోసం
హైదరాబాదు మియాపూర్‌కు చెందిన కొరటాని శివపై ఆదోని ఎన్జీవో కాలనీ నివాసి నాగరాజు సోమవారం డిఐజి, జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ కు ఫిర్యాదు చేశారు. సాఫ్ట్వేర్ ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి, రూ. 4 లక్షలు వసూలు చేసి, జాబ్ ఆఫర్ లెటర్లు ఇచ్చి మోసం చేశాడని నాగరాజు ఆరోపించారు. ఈ విషయంపై కర్నూలు పోలీసులు చట్టపరమైన విచారణ జరిపి బాధితుడికి న్యాయం అందిస్తారని జిల్లా ఇన్చార్జి ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు.








































