ఆళ్లగడ్డ జాబ్‌మేళాలో 125 మందికి ఉద్యోగాలు

3455చూసినవారు
ఆళ్లగడ్డ జాబ్‌మేళాలో 125 మందికి ఉద్యోగాలు
ఆళ్లగడ్డలోని కేవీ సుబ్బారెడ్డి కళాశాలలో నిర్వహించిన మెగా జాబ్‌మేళాలో 10 ప్రముఖ కంపెనీలు పాల్గొన్నాయి. ఈ సందర్భంగా ఇంటర్వ్యూలలో ఎంపికైన 125 మంది యువతకు ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ ఉద్యోగ నియామక పత్రాలను అందజేశారు. నిరుద్యోగ యువతకు స్థానికంగానే ఉపాధి అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని, భవిష్యత్తులో ఇలాంటి కార్యక్రమాలను మరింత విస్తరిస్తామని ఆమె ఈ సందర్భంగా తెలిపారు. ఈ మెగా జాబ్‌మేళా ద్వారా అనేక మంది యువతకు ఉపాధి లభించింది.

సంబంధిత పోస్ట్