చెంచుగూడెంలో 40 మందికి ఆధార్ లేక పథకాలకు దూరం

1331చూసినవారు
చెంచుగూడెంలో 40 మందికి ఆధార్ లేక పథకాలకు దూరం
ఆళ్లగడ్డ నియోజకవర్గం రుద్రవరం మండలం చిన్నయ్యస్వామి చెంచుగూడెం గ్రామంలోని 60 కుటుంబాల్లో 40 మంది గిరిజనులకు ఆధార్ కార్డులు లేకపోవడంతో ప్రభుత్వ పథకాలు అందడం లేదని మనోరంజన్ ప్రతాప్ తెలిపారు. పశుసంవర్ధక శాఖ చేపట్టిన సర్వేలో ఈ విషయం వెలుగులోకి వచ్చిందని, ఆధార్ ఉన్నవారికే పౌల్ట్రీ అభివృద్ధి పథకాలు వర్తిస్తాయని, అందరూ వెంటనే ఆధార్ పొందాలని ఆయన సూచించారు.

సంబంధిత పోస్ట్