ఉయ్యాలవాడ ఆదర్శ పాఠశాలలో ఆరో తరగతి ప్రవేశ పరీక్ష ఈ నెల 12న జరగనుంది. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు తమ హాల్ టికెట్లను నెట్ సెంటర్లు లేదా పాఠశాల నుండే పొందవచ్చు. పరీక్ష ఉదయం 10 గంటల నుండి 12 గంటల వరకు నిర్వహించబడుతుంది. విద్యార్థులు పరీక్ష ప్రారంభానికి గంట ముందుగానే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలని ప్రిన్సిపల్ సూచించారు.