డోన్ పట్టణంలోని పాత బస్టాండ్లో ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ధర్నా జరిగింది. విశాఖ ఉక్కు కర్మాగారంలో అగ్నిప్రమాదంలో మృతిచెందిన కార్మికుల కుటుంబాలకు కోటి రూపాయల ఎక్స్‌గ్రేషియా,
ఉద్యోగాలు కల్పించాలని ఏఐటీయూసీ నంద్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి సుంకయ్య డిమాండ్ చేశారు. కార్మికుల మృతి అత్యంత బాధాకరమని ఆయన పేర్కొన్నారు.