ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ 'మన భూమా–మన ధీమా' కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భాగంగా వారానికి మూడు రోజులు గ్రామాలు, వార్డుల్లో పర్యటించి ప్రజా సమస్యలను క్షేత్రస్థాయిలో పరిష్కరిస్తామని ఆమె తెలిపారు. కోయిలకుంట్ల రోడ్డు ప్రాంతంలో డ్రైనేజీ, రోడ్ల పరిస్థితిని పరిశీలించిన ఆమె, అవసరమైన నిధులు తీసుకువచ్చి 4–5 నెలల్లో డ్రైనేజీ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తామని హామీ ఇచ్చారు.