అంబటి రాంబాబు వ్యాఖ్యలపై బైరెడ్డి శబరి ఫైర్

438చూసినవారు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు అంబటి రాంబాబు చేసిన వ్యక్తిగత విమర్శలను నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి తీవ్రంగా ఖండించారు. ఆదివారం నాడు సోషల్ మీడియాలో విడుదల చేసిన వీడియోలో, అధికారం కోల్పోయినా వైసీపీ నాయకుల్లో మార్పు రాకపోవడం దురదృష్టకరమని ఆమె అన్నారు. పల్నాడు ప్రజలు తిరస్కరించినా అంబటి రాంబాబుకు బుద్ధి రాలేదని, ఓటమి వైఫల్యంతో ఏం మాట్లాడుతున్నారో ఆయనకే అర్థం కావడం లేదని విమర్శించారు. వ్యక్తిగత విమర్శలు చేయడం మీ రాజకీయ అసమర్థతను ఒప్పుకోవడమేనని, ఇకనైనా అసత్య ఆరోపణలు, వ్యక్తిగత విమర్శలు మానుకోవాలని ఆమె సూచించారు. కూటమి ప్రభుత్వం ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తోందని, ఇలాంటి చౌకబారు విమర్శలకు భయపడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. రాయలసీమలో అయితే అంబటి రాంబాబును తమ కార్యకర్తలు పాతి పెట్టేవారని, తక్షణమే తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని ముఖ్యమంత్రికి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్