ఆళ్లగడ్డ పట్టణంలోని 9వ వార్డు సచివాలయాన్ని మున్సిపల్ కమిషనర్ కిషోర్ శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రజలకు అందుతున్న సేవలు, వివిధ విభాగాల పనితీరును పరిశీలించిన ఆయన రికార్డులు, ఉద్యోగుల బయోమెట్రిక్ హాజరును తనిఖీ చేశారు. ప్రజల నుంచి వచ్చే అర్జీలను పెండింగ్‌లో ఉంచకుండా త్వరితగతిన పరిష్కరించాలని సిబ్బందికి సూచించారు.