ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ శనివారం చాగలమర్రిలో మాట్లాడుతూ, గ్రామాల అభివృద్ధి, పేదల సంక్షేమమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో అభివృద్ధి కుంటుపడిందని, ప్రస్తుతం చేపడుతున్న అభివృద్ధి పనులను చూసి
వైసీపీ నాయకులు విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు. టీడీపీపై విమర్శలు చేసే నైతిక హక్కు వైసీపీకి లేదని ఆమె పేర్కొన్నారు.