అధిక డిఎపి యూరియా వాడకం వల్ల భూములు నిస్సారమవుతాయి..ఏవో

4800చూసినవారు
ఆళ్లగడ్డ మండల వ్యవసాయ అధికారి కిషోర్ కుమార్ రెడ్డి బుధవారం మీడియాతో మాట్లాడుతూ జూన్ 1వ తేదీ నుండి ప్రభుత్వం ఏపీ ఏ ఎమ్ ఎఫ్ యాప్ ద్వారా యూరియా, డిఎపి ఎరువులను రైతులకు అందజేస్తుందని తెలిపారు. అధిక యూరియా, డిఏపి వాడకం వల్ల భూములు నిస్సారం అవుతున్నందున, పంటలకు అవసరమైన మేరకే ఎరువులు పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని ఆయన పేర్కొన్నారు. వాతావరణ శాఖ ఎల్ నినో ప్రభావం ఉంటుందని, కాబట్టి రైతులు అధిక నీటిని ఆశించే పంటలు వేసుకోకుండా తగు జాగ్రత్తలు పాటించి పంట నష్టాలకు గురి కాకుండా ఉండాలని సూచించారు.

సంబంధిత పోస్ట్