ఆళ్లగడ్డలో నేడు మెగా జాబ్ మేళా

2518చూసినవారు
ఆళ్లగడ్డలో నేడు మెగా జాబ్ మేళా
ఆళ్లగడ్డలోని కేవీ సుబ్బారెడ్డి కళాశాలలో సోమవారం మెగా జాబ్ మేళా నిర్వహించనున్నట్లు ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో జరిగే ఈ మేళాలో 10 ప్రముఖ కంపెనీలు పాల్గొంటాయి. ఈ జాబ్ మేళా ద్వారా సుమారు 950 మంది నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించబడతాయి. ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని నిరుద్యోగులకు పిలుపునిచ్చారు.

సంబంధిత పోస్ట్