ఆళ్లగడ్డ ప్రభుత్వ ఆసుపత్రిని ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ ఆకస్మికంగా తనిఖీ చేసి వైద్య సేవల తీరును పరిశీలించారు. రోగులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రిలో గుర్తించిన లోపాలను వెంటనే సరిదిద్దాలని వైద్యాధికారులకు ఆమె ఆదేశాలు జారీ చేశారు. పేదలకు నాణ్యమైన వైద్యం అందించడం, పరిశుభ్రత పాటించడం, మందుల కొరత లేకుండా చూడటం వంటి అంశాలపై నిరంతర పర్యవేక్షణ ఉంటుందని, ప్రజారోగ్యంపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహిస్తుందని ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ తెలిపారు.