రుద్రవరం మండలంలో నూతన తహశీల్దార్‌గా నాగవీణ గురువారం బాధ్యతలు స్వీకరించారు. గతంలో ఇక్కడ పనిచేసిన ధోని ఆల్ ఫ్రైడ్ నంద్యాల కలెక్టరేట్‌కు బదిలీ అయ్యారు. బాధ్యతలు చేపట్టిన అనంతరం నాగవీణ మాట్లాడుతూ, మండలంలోని రెవెన్యూ సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు కృషి చేస్తానని, ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే లక్ష్యంగా పనిచేస్తానని స్పష్టం చేశారు.