నంద్యాల టీడీపీ కార్యాలయంలో మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్, మాజీ మంత్రి అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. ముఖ్యమంత్రి చంద్రబాబుపై అంబటి చేసిన అనుచిత వ్యాఖ్యలు తగవని, వెంటనే సీఎంకు, రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఇలాంటి వ్యాఖ్యలు దురదృష్టకరమని, పునరావృతం అయితే ప్రజలే తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు.