ఆళ్లగడ్డలో శ్రీ లక్ష్మీనరసింహస్వామి పారువేట ఉత్సవం: ఆధ్యాత్మిక వాతావరణం

546చూసినవారు
ఆళ్లగడ్డ పట్టణంలో శుక్రవారం శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి పారువేట ఉత్సవం అట్టహాసంగా జరిగింది. స్వామి వారి పల్లకి స్థానిక మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా ఉన్న మొదటి తెలుపు వద్దకు చేరుకోవడంతో పట్టణమంతా ఆధ్యాత్మిక వాతావరణంతో నిండిపోయింది. ఈ సందర్భంగా ఆళ్లగడ్డ డి.ఎస్.పి ప్రమోద్ ఆదేశాల మేరకు పట్టణ సీఐ యుగంధర్, ఎస్సైలు షేక్ నగీన, శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. విధి నిర్వహణలో ఉన్న పోలీసులు, మున్సిపల్, ఎమ్మార్వో కార్యాలయ అధికారులు భక్తిశ్రద్ధలతో పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయ అర్చకులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. సీఐ యుగంధర్ మాట్లాడుతూ, ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ట్రాఫిక్ క్రమబద్ధీకరణతో పాటు, స్వామి వారి పల్లకి ఊరేగింపు ప్రశాంతంగా సాగేలా చర్యలు తీసుకున్నామని, భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చి స్వామి వారిని దర్శించుకోవాలని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్