శనివారం రుద్రవరం మండలంలోని నరసాపురం గ్రామంలో విచిత్ర వాతావరణం నెలకొంది. ఆకాశం ఒక్కసారిగా మేఘావృతమై స్వల్ప వర్షం కురవగా, అదే సమయంలో ఎండ తీవ్రంగానే కొనసాగింది. ఎండ, వాన ఒకేసారి కురవడంతో గ్రామస్థులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఈ అకాల వర్షం కొద్దిసేపు వాతావరణాన్ని చల్లబరిచి, ప్రజలకు వేడి నుంచి ఉపశమనం కలిగించింది.