భార్య అక్రమ సంబంధం.. భర్త ఆత్మహత్యతో అనాథలైన ముగ్గురు పిల్లలు

1863చూసినవారు
భార్య అక్రమ సంబంధం.. భర్త ఆత్మహత్యతో అనాథలైన ముగ్గురు పిల్లలు
నంద్యాల జిల్లా రుద్రవరం మండలంలోని పెద్ద కంబలూరు గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. కొత్తపల్లెకు చెందిన సుగుణకు, పెద్ద కంబలూరుకు చెందిన పగిడి కళ్యాణ్‌కు వివాహం జరిగింది. భర్త లేని సమయంలో సుగుణ అక్రమ సంబంధం పెట్టుకుంది. ఈ విషయం భర్తకు తెలిసి హెచ్చరించేవాడు. ఈ క్రమంలో ముగ్గురు పిల్లలు, భర్తను వదిలి వెళ్లిపోయింది. ఈ బాధతో జనవరి 29న కళ్యాణ్ గడ్డి మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో 9 ఏళ్ల విజయ్, 6 ఏళ్ల అను, 4 ఏళ్ల పావని అనాథలయ్యారు.

సంబంధిత పోస్ట్