
కుప్పగల్ రైలు నుంచి జారిపడి గుర్తుతెలియని వ్యక్తి మృతి
ఆదోని డివిజన్ పరిధిలోని కోసిగి-కుప్పగల్ మధ్య రైల్వే ట్రాక్‌లో సోమవారం గుర్తు తెలియని వ్యక్తి రైలు నుంచి జారిపడి మృతి చెందాడు. కిలోమీటర్ నం. 520/14-16 వద్ద జరిగిన ఈ ప్రమాదంలో, సుమారు 40 ఏళ్ల వయసున్న వ్యక్తి తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మరణించాడు. అతడి వద్ద ఎటువంటి గుర్తింపు ఆధారాలు లభించలేదని రైల్వే హెడ్ కానిస్టేబుల్ సాయిసర్వేశ్వర రావు తెలిపారు. తెలిసినవారుంటే పోలీసులను సంప్రదించాలని ఆయన అభ్యర్థించారు.




































