కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు శనివారం తన కార్యాలయంలో కర్నూలు జిల్లా ఆస్పరికి చెందిన పి. కేశవరెడ్డికి ముఖ్యమంత్రి సహాయ నిధి పథకం కింద రూ.3,09,470 ఆర్ధిక సహాయాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం పేద ప్రజలకు అండగా ఉంటుందని, ప్రజల ఆరోగ్యం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ఖర్చు చేస్తుందని తెలిపారు.