ఆలూరు మండలం పెద్దహోతూరుకు చెందిన అంగన్వాడీ టీచర్ లేపాక్షమ్మ,
టీడీపీ నేత హరిజన వీరేశం తనను ప్రతిరోజూ కేంద్రానికి వచ్చి వేధించేవాడని, పౌష్టికాహారం పంపిణీ సమయంలో అసభ్యంగా మాట్లాడుతూ ఫోటోలు తీసేవాడని ఆరోపించారు. ఈ వేధింపులు భరించలేక మనస్తాపంతో ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డానని తెలిపారు. నిందితుడిపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు ఆమె వెల్లడించారు.