ఆలూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఈ నెల 30న జాబ్ మేళా నిర్వహించనున్నట్లు స్కిల్ డెవలప్‌మెంట్ అధికారి ఆనంద్ రాజ్ కుమార్ తెలిపారు. ఈ మేళాలో 10వ తరగతి నుంచి డిగ్రీ వరకు చదివిన 18 నుంచి 35 ఏళ్ల వయసు గల అభ్యర్థులు పాల్గొనవచ్చని ఆయన పేర్కొన్నారు. ఈ జాబ్ మేళాకు 10 ప్రముఖ కంపెనీల ప్రతినిధులు హాజరవుతారని, ఇది యువతకు ఉపాధి అవకాశాలను కల్పించేందుకు ఉద్దేశించినదని ఆయన తెలిపారు. ఆదివారం జాబ్ మేళా కరపత్రాలను ఆయన విడుదల చేశారు.