గుంతకల్‌ ఎలక్ట్రిక్‌ లోకో షెడ్‌ను సందర్శించిన విద్యార్థులు

9చూసినవారు
గుంతకల్‌ ఎలక్ట్రిక్‌ లోకో షెడ్‌ను సందర్శించిన విద్యార్థులు
పి. యం. శ్రీ జడ్. పి హైస్కూల్‌ నేమకల్‌ విద్యార్థులు బుధవారం ప్రధానోపాధ్యాయులు పి. ఏకాంబరం ఆధ్వర్యంలో గుంతకల్‌లోని ఎలక్ట్రిక్‌ లోకో షెడ్‌ను పారిశ్రామిక సందర్శన కార్యక్రమంలో భాగంగా సందర్శించారు. ఈ కార్యక్రమంలో 9, 10వ తరగతి విద్యార్థులు పాల్గొన్నారు. ఎలక్ట్రిక్‌ లోకో షెడ్‌ అధికారులు విద్యార్థులకు విద్యుత్‌ లోకోమోటివ్‌ల పనితీరు, నిర్వహణ, భద్రతా నియమాలు, ఆధునిక రైల్వే సాంకేతికతపై అవగాహన కల్పించారు. విద్యార్థులు లోకోమోటివ్‌లోని మోటార్లు, బ్రేకింగ్‌ వ్యవస్థ, కంట్రోల్‌ ప్యానెల్స్‌ తదితర పరికరాలను ప్రత్యక్షంగా పరిశీలించి ఆచరణాత్మక జ్ఞానం పొందారు.

సంబంధిత పోస్ట్