ఆలూరులో టిడిపి శక్తి ప్రదర్శన, విస్తృత సమావేశం

1844చూసినవారు
ఆదివారం, ఆలూరు నియోజకవర్గ ఇన్చార్జిగా వైకుంఠం జ్యోతి నియమితులయ్యారు. ఈ సందర్భంగా మాజీ టీడీపీ ఇన్చార్జ్ వైకుంఠం శివప్రసాద్‌తో పాటు, పార్టీ నాయకులు, కార్యకర్తలు జ్యోతిని కలిసి అభినందించారు. పార్టీ కోసం కష్టపడిన ప్రతి కార్యకర్తకు న్యాయం చేస్తామని జ్యోతి ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ఈ సమావేశంలో ఆలూరు టౌన్ సీనియర్ నాయకులు, యూత్, హమాలీ సంఘం ప్రతినిధులతో పాటు పెద్ద సంఖ్యలో టీడీపీ శ్రేణులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్