ఆదివారం ఆలూరు పట్టణంలోని R&B గెస్ట్ హౌస్‌లో వైఎస్ఆర్సీపీ అధినేత జగన్ ఆదేశాల మేరకు, కార్యకర్తలకు అండగా నిలిచేందుకు రూపొందించిన 'డిజిటల్ బుక్'ను ఎమ్మెల్యే బుసినే విరుపాక్షి ఆదివారం ఆవిష్కరించారు. కార్యకర్తలు digitalbook.weysrcp.com పోర్టల్ ద్వారా ఫిర్యాదులు అప్లోడ్ చేయవచ్చని, 040-49171718 ఐవిఆర్ఎస్ నంబర్ ద్వారా కూడా సమస్యలు తెలియజేయవచ్చని ఆయన తెలిపారు. ఈ డిజిటల్ బుక్ ద్వారా పార్టీ కార్యకర్తల సమస్యలను పరిష్కరించేందుకు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కృషి చేయనుంది.