ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలి

3403చూసినవారు
నంద్యాల జిల్లా, బనగానపల్లె మండలం రామతీర్థం గ్రామంలో జెకేఆర్ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జె.ఎస్.ఎస్. బ్రహ్మానందచారి ఆధ్వర్యంలో ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు రాత పుస్తకాలు, పెన్నులు పంపిణీ చేశారు. పర్యావరణ పరిరక్షణ, బడిబాటపై అవగాహన సదస్సు, ర్యాలీని కూడా ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా బ్రహ్మానందచారి మాట్లాడుతూ, పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, ప్లాస్టిక్ వాడకాన్ని మానుకోవాలని, చెట్లను నాటాలని, వాయు కాలుష్యాన్ని నివారించాలని పిలుపునిచ్చారు.

సంబంధిత పోస్ట్