కలంకారి కళాకారులకు ప్రోత్సాహం అందించాలి - బ్రహ్మానంద చారి

373చూసినవారు
బనగానపల్లె మండలం టంగుటూరు గ్రామంలో జే కే ఆర్ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జే ఎస్ ఎస్ బ్రహ్మానందచార ఆధ్వర్యంలో రాష్ట్రపతి అవార్డు గ్రహీత కే శివ ప్రసాద్ రెడ్డికి కలంకారి రంగానికి సంబంధించి ఒక సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా శివప్రసాద్ రెడ్డిని సన్మానించిన బ్రహ్మానంద చారి, భారతదేశ సంప్రదాయంలో కలంకారి రంగానికి ఉన్న విశిష్టతను కొనియాడుతూ, ఈ రంగంలోని కళాకారులను ప్రభుత్వం ప్రోత్సహించాలని, వారి కోసం ప్రత్యేక కోర్సులు, పాఠశాలలు ఏర్పాటు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేశారు. ఈ సదస్సు నంద్యాల, బనగానపల్లె ప్రాంతాలలో జరిగింది.

సంబంధిత పోస్ట్