సౌర విద్యుత్ ప్రాజెక్టులో స్థానికులకు ఉపాధి కల్పించాలి: బీజేపీ నాయకులు

644చూసినవారు
సౌర విద్యుత్ ప్రాజెక్టులో స్థానికులకు ఉపాధి కల్పించాలి: బీజేపీ నాయకులు
అవుకు మండలంలోని చెన్నంపల్లె గ్రామ సమీపంలో నిర్మిస్తున్న సౌర విద్యుత్ ప్రాజెక్టులో స్థానికులకు ఉపాధి అవకాశాలు కల్పించాలని, ప్రాజెక్ట్ యాజమాన్యం గ్రామంలో మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యత ఇవ్వాలని, భూములు కోల్పోయిన రైతులకు న్యాయం చేయాలని బనగానపల్లె బీజేపీ మండల అధ్యక్షుడు హరికృష్ణ గౌడ్, అవుకు మండల అధ్యక్షుడు రవికుమార్ ఆర్డీఓ నరేంద్రనాధ్ రెడ్డికి సోమవారం వినతిపత్రం అందజేశారు. ఈ మేరకు వారు తమ డిమాండ్లను తెలియజేశారు.

సంబంధిత పోస్ట్